ఛత్తీస్‌గఢ్‌లో 63 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 18 మంది మహిళలు ఉండటం గమనార్హం. వీరిలో 36 మందిపై మొత్తం రూ.1.19 కోట్ల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పునరావాస విధానాలు, భద్రతా బలగాల ఒత్తిడి కారణంగా మావోయిస్టులు ప్రధాన ప్రవాహంలోకి వస్తున్నారని పేర్కొన్నారు. గత ఏడాది ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 1,500 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు.