ఐదేళ్ల కాలంలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు

భారత్‌లో గత ఐదేళ్లలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు నమోదయ్యాయని డీజీసీఏ తాజా నివేదికలో వెల్లడించింది. 2024 జనవరి 1 నుంచి 2025 మే 31 వరకు 11 మే డే కాల్స్ వచ్చాయని తెలిపింది. మే డే కాల్స్ వచ్చినప్పటికీ పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదాలు తప్పాయని పేర్కొంది. చాలా వరకు విమానాల్లో పైలట్లు సమస్యలను పరిష్కరిస్తున్నప్పటికీ, అన్ని సమయాల్లోనూ అలాంటి అవకాశం ఉండదని అభిప్రాయపడింది.

సంబంధిత పోస్ట్