రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) దేశవ్యాప్తంగా 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి, డిప్లొమా, ఇంజినీరింగ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 30న ప్రారంభమై.. జులై 29 వరకు కొనసాగుతుంది. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ కోసం 323, గ్రేడ్-III కోసం 6,234 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్-I కి ఇంజినీరింగ్ డిగ్రీ, గ్రేడ్-III కి 10వ తరగతితో పాటు ITI అర్హత అవసరం. ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా జరుగుతుంది.