తిరుమల నడక మార్గంలో 7 అడుగుల నాగుపాము కలకలం

AP: శేషాచలం అటవీ ప్రాంతంలో పాముల సంచారం పెరిగింది. తిరుమల నడక మార్గంలో భక్తులకు తరచూ పాములు కనిపిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా గాలిగోపురం వద్ద 7 అడుగుల భారీ నాగుపాము కనిపించడంతో భక్తులు భయపడి పరుగులు తీశారు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమాచారంతో, ఫారెస్ట్ విభాగం ఉద్యోగి భాస్కర్ నాయుడు చాకచక్యంగా పామును బంధించి, శేషాచలం కొండల్లో సురక్షితంగా వదిలిపెట్టారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల ప్రాంతంలో పాములు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, వాటి దగ్గరకు వెళ్లవద్దని సెక్యూరిటీ సిబ్బంది సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్