రెండు సంవత్సరాల పిల్లలకు తరచుగా జలుబు, దగ్గు, జ్వరం రావడం సాధారణమేనని, ఇది రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం కాదని పిల్లల వైద్య నిపుణులు తెలిపారు. పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి రంగురంగుల ఆహారం, ప్రొటీన్, తగినంత నిద్ర, బయట ఆడుకోవడం, టీకాలు, జంక్ ఫుడ్‌కు దూరం, చేతుల పరిశుభ్రత వంటి బంగారు సూత్రాలను ఆయన సూచించారు. అయితే, తరచుగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, న్యూమోనియా, బరువు పెరగకపోవడం వంటి సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ఇమ్యూనిటీని పెంచే మ్యాజిక్ సిరప్‌లు లేవని, ఆరోగ్యకరమైన అలవాట్లే రోగనిరోధక శక్తిని సహజంగా బలపరుస్తాయని ఆయన తెలిపారు.