ఆరుగురికి ప్రాణ దానం చేసిన 7 ఏళ్ల బాలుడు!

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్​ డెడ్​ అయిన 7 ఏళ్ల బాలుడి కుటుంబం తీసుకున్న నిర్ణయం ఆరుగురికి ప్రాణం పోసింది. HYDలోని తిరుమలగిరి యాదమ్మ నగర్‌కు చెందిన లోకినేని రఘు, సౌమ్య పాపారావు కుటుంబం ఉద్యోగరిత్యా తమిళనాడులో ఉంటోంది. అయితే వీరి కుమారుడు యాశ్వన్(7) జూన్​ 29న సైకిల్​పై రోడ్డు దాటుతుండగా అంబులెన్స్​ అతడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బాలుడికి జులై 5న బ్రెయిన్​ డెడ్​ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ​ కుటుంబం అవయవదానానికి ముందుకు వచ్చింది. యాశ్వన్​ రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కార్నియాలు, గుండె కవాటంతో సహా మొత్తం ఆరు అవయవాలను దానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్