ఈ ఏడాది దాదాపు 70 వేల మంది నైపుణ్యం కలిగిన కార్మికులను రష్యాకు తీసుకునేందుకు అంగీకరించిందని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఆటో, ఫార్మా, ఫుడ్, మెరైన్ ప్రొడక్ట్స్, ఇంజినీరింగ్ గూడ్స్, కెమికల్స్, టెక్స్టైల్స్ వంటి రంగాలలో వాణిజ్యాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, రష్యన్ ఆర్మీలో పనిచేస్తున్న 140 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు పార్లమెంటరీ ప్యానెల్‌కు వివరించారు.