ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC)లో 723 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆదివారంతో గడువు ముగియనుంది. ట్రేడ్స్‌మెన్-389, ఫైర్‌మెన్-247, మెటీరియల్ అసిస్టెంట్-19, జూ.ఆఫీస్ అసిస్టెంట్-27 సహా మరిన్ని పోస్టులను బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లమో, బీటెక్ పాసైనవారు అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.18వేలు - రూ.92,300 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ aocrecruitment.gov.inను సంప్రదించగలరు.