ఈ ఏడాది 73 మంది రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వీరే!

ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ మధ్య దేశవ్యాప్తంగా 73 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం బులిటెన్ విడుదల చేసింది. యూపీ నుంచి అత్యధికంగా 10 మంది, మహారాష్ట్ర నుంచి 7 మంది పదవీ విరమణ చేస్తున్నారు. ఏపీ నుంచి వైసీపీకి చెందిన అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు టీడీపీ సభ్యుడు సానా సతీష్ బాబు పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున అభిషేక్ సింఘ్వీ రిటైర్ అవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్