మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆత్రే లేఅవుట్‌లో నివసించే 74 ఏళ్ల జయంత్ నారాయణ్ కావ్రే స్విమ్మింగ్ పూల్‌లో మునిగి మృతి చెందాడు. నార్త్ అంబజారి రోడ్‌లోని స్విమ్మింగ్ పూల్‌కు ఎప్పటిలాగే ఈత కొట్టడానికి వెళ్లాడు. కానీ ఈత కొడుతుండగా అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయాడు. వెంటనే అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు వెల్లడించారు.