DRDOలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నిషియన్-A పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు జనవరి 11 అర్ధరాత్రితో ముగుస్తుంది. కేటగిరీ A పోస్టులకు SSC+ITI, కేటగిరీ Bకి BSc లేదా 3సం. డిప్లొమా అర్హతగా నిర్ణయించారు. నెలకు ₹1లక్ష వరకు వేతనంతో పాటు HRA, TA, పిల్లల ఎడ్యుకేషన్, మెడికల్ వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. 18-28 సంవత్సరాల మధ్య వయస్కులు ఈ ఉద్యోగాలకు అర్హులు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం DRDO అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.