ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది. ఇరాన్‌లోని కీలక సైనిక కేంద్రాలు, వ్యూహాత్మక స్థావరాలపై దాడులు కొనసాగుతుండటంతో ప్రాణనష్టం పెరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 1,000 మంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మరణించినట్లు తెలుస్తోంది.