AP: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజు శ్రీవారిని 76,935 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీ కారణంగా దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది.