మేఘాలయలో రాజకీయ సమీకరణాలు మారాయి. యూడీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో బీజేపీ బలం 2 నుంచి 10కి పెరిగింది. 11 మంది ఎమ్మెల్యేలున్న యూడీపీ కంటే ఒక స్థానం వెనుకబడి బీజేపీ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది.