ఫ్రాన్స్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలు.. ఆఫ్రికాకు చెందిన 24 ఏళ్ల యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. వీరిద్దరి మధ్య 57 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, రెండేళ్ల పరిచయం తర్వాత ఆమె అతడిని కలిసేందుకు రాగా, ఎయిర్‌పోర్ట్‌లో పలకరించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంట సెప్టెంబర్‌లో వివాహం చేసుకోనున్నట్లు వెల్లడించారు.