తిరుమల అన్నమయ్య భవనం సమీపంలో బుధవారం తొమ్మిది అడుగుల భారీ జెర్రిపోతు కనిపించడంతో కలకలం రేగింది. గదిలో పామును చూసి భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే TTD ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. ఆయన చాకచక్యంగా పామును పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ సంఘటనతో భక్తులు, సిబ్బందిలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.