TG: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి వివారులోని నోష్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ నెల 9 న కూడా ఇదే ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.