మమత మీటింగ్‌కు 9 మంది ఎమ్మెల్యేల డుమ్మా !

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన కీలక సమావేశానికి 9 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దక్షిణ కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపగా, కేవలం 71 మందే హాజరయ్యారు. ఈ పరిణామం తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమావేశంలో 'మనవాళ్లే మనకు ద్రోహం చేశారు' అని మమత వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే, ప్రజాతీర్పును గౌరవిస్తామని, కానీ రాజీనామా చేయబోమని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్