దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర.. తొమ్మిది మంది అరెస్ట్‌

దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసక చర్యలకు పాల్పడే కుట్రను భగ్నం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్