పాక్‌పై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 23 నిమిషాల్లోనే 9 టెర్రరిస్ట్ ఎయిర్‌బేస్‌లు నశింపజేశామని తెలిపారు. ఒక్క టార్గెట్ కూడా మిస్ కాకుండా దాడులు పూర్తయ్యాయని చెప్పారు. అయితే విదేశీ మీడియా భారత్‌కే నష్టం అయినట్లు అసత్య వార్తలు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. దీనిపై ఒక్క ఫోటో అయినా చూపించాలని, శాటిలైట్ చిత్రాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.