చెరువులో జారిపడి 9 ఏళ్ల బాలుడు దుర్మరణం

TG: వరంగల్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బుధవారం మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడు కాలకృత్యాల కోసం సమీపంలోని చెరువు వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. పండుగ రోజున జరిగిన ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బాలుడి తండ్రి మున్నూరు చెన్నయ్య ఫిర్యాదు మేరకు మద్దూరు ఎస్సై విజయ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕