TG: 20 నెలల కాంగ్రెస్ పాలనలో 93 మంది విద్యార్థులు మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమని BRS నేత హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 'గురుకులాల్లో చనిపోతున్న విద్యార్థుల వార్తలు విని తల్లిదండ్రులు భయపడుతున్నారు. నాడు దేశానికి దిక్సూచిలా నిలిచిన రాష్ట్ర విద్యావ్యవస్థ.. నేడు దిక్కుతోచని స్థితికి చేరింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు జరుగకుండా నాణ్యమైన ఆహారం అందించాలని, ఆత్మహత్యలు జరగకుండా చర్యలు చేపట్టాలి' అని డిమాండ్ చేశారు.