TG: ఓ బాలుడి కిడ్నీలో ఏకంగా 200 గ్రాముల రాయిని గుర్తించారు వైద్యులు. ఈ ఘటన ఆదిలాబాద్ లో వెలుగు చూసింది. తీవ్ర నొప్పితో ఆస్పత్రికి వచ్చిన బాలుడికి శస్త్రచికిత్స చేసి భారీ రాయిని వైద్యులు తొలగించారు. సిరికొండ(M) పాలవాగుకు చెందిన కొట్నాక్ లింగు(12) మూడేళ్లుగా మూడేళ్లుగా పెరుగుతున్న ఈ రాయి వల్ల తీవ్ర నొప్పితో బాధపడ్డాడు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యుడు కె. కార్తిక్ కుమార్ శస్త్రచికిత్స చేసి దీనిని విజయవంతంగా తొలగించారు. చిన్న వయసులో ఇంత పెద్ద రాయి రావడం అరుదైన విషయమని వైద్యులు పేర్కొన్నారు.