19 ఏళ్ళ యువతిని గర్భవతిని చేసి.. చంపేసి పాతిపెట్టాడు!

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల దారుణ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ ఢిల్లీకి చెందిన సోని (19 ఏళ్లు)ని సంజూ అకా సలీమ్ అనే యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి గర్భవతిని చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని సోని సంజూపై ఒత్తిడి చేసింది. దాంతో కోపంతో రగిలిపోయిన సంజూ తన స్నేహితులతో కలిసి సోనిని చంపేసి పాతిపెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సంజూతో సహా ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్