కర్ణాటకలోని మండ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ 19 ఏళ్ల యువతి కారు ప్రమాదంలో మృతి చెందిన ఘటన కీలక మలుపు తిరిగింది. పుట్టినరోజు వేడుకల నెపంతో తీసుకెళ్లిన ముగ్గురు స్నేహితులు ఆమెపై అత్యాచార యత్నం చేసి, అడ్డుకోవడంతో దారుణంగా హత్య చేశారని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపై హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు శవాన్ని కారులో ఉంచి స్తంభానికి ఢీకొట్టించారని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.