సర్జరీ సమయంలో డాక్టర్ పొరపాటున వేరే అవయవాన్ని తొలగించడంతో 70 ఏళ్ల వృద్ధుడు మృతి

శస్త్రచికిత్స సమయంలో డాక్టర్ పొరపాటున మరో అవయవాన్ని తొలగించడంతో అమెరికా ఫ్లోరిడాలో కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడని న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. తొలుత పరీక్షల్లో వృద్ధుడికి ప్లీహం(స్ప్లీన్) ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉందని తేల్చిన వైద్యులు, సర్జరీ అవసరమని చెప్పారు. అయితే ప్లీహాన్ని సరిచేసేందుకు బదులుగా డాక్టర్ వృద్ధుడి కాలేయాన్ని తొలగించాడు.

సంబంధిత పోస్ట్