మర్రిచెట్టు ఊడల కింద 900 ఏండ్ల నాటి శివాలయం

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూర్‌ సమీపంలోని బెగిలి గ్రామంలో 900 ఏళ్ల నాటి పురాతన శివాలయం బయటపడింది. ఒక మర్రిచెట్టు ఊడల కింద కప్పబడి ఉన్న ఈ ఆలయాన్ని స్థానిక ఉపాధ్యాయురాలు జయలక్ష్మి, పురావస్తు పరిశోధకులు గుర్తించారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం కులోత్తుంగ చోళుడి కాలం నాటిదని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కొండ దిగువన ఉన్న 200 ఏళ్ల నాటి మర్రిచెట్టు ఊడలు ఆలయాన్ని పూర్తిగా కప్పేయడంతో స్థానికులు కూడా దీని ఉనికిని గుర్తించలేకపోయారు. దీనిని వ్యవహారికంగా పాండవ గుడిగా పిలుస్తున్నప్పటికీ, బయటపడే వరకు గుడి ఉన్న విషయం ఎవరికీ తెలియదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్