TG: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామంలో ఎంజాల కుమారస్వామి అనే రైతు కూరగాయల పంట వేశాడు. ఆ పంటలో వినూత్నంగా రామచిలుక ఆకారంలో ఉన్న బీరకాయ కాసింది. కూరగాయలు తెంపుతుండగా ఈ వింత ఆకారపు బీరకాయ కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. జన్యు మార్పిడి వల్ల కొన్నిసార్లు విత్తనాలలో చిన్న మార్పులు వస్తాయని పలువురు రైతులు పేర్కొన్నారు.