గుజరాత్‌లోని వాపీలో జరిగిన రోడ్డు ప్రమాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు దాటుతున్న సమయంలో తల్లి ఒక్కక్షణం పసిపాప చేయి వదిలేయడంతో, వేగంగా వచ్చిన బైక్ చిన్నారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వాహనదారులు, తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తున్నాయి. పిల్లలతో రోడ్డు దాటేటప్పుడు చిన్న అజాగ్రత్త కూడా ప్రాణాంతకమవుతుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.