ఒడిశాలోని నయాగఢ్ జిల్లా కనిపాడ అడవిలో తేనె సేకరించడానికి వెళ్లిన షిబా ప్రధాన్ అనే బాలుడు, రాళ్ల మధ్య ఉన్న సందులో తల ఇరుక్కుపోయి ప్రమాదానికి గురయ్యాడు. అతని తల ఇరుక్కుపోవడమే కాకుండా, అక్కడే ఒక విషపూరితమైన పాము ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు మృత్యువుతో పోరాడిన బాలుడిని, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా సురక్షితంగా బయటకు తీశారు. అదృష్టవశాత్తూ బాలుడికి ఎటువంటి పెద్ద గాయాలు కాలేదు.