పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత క్రీడాకారులకు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఎండీ సజ్జన్ జిందాల్ బంపరాఫర్ ప్రకటించారు. 'పతకం సాధించిన ప్రతీ అథ్లెట్‌కు ఎంజీ విండ్సర్ కారును బహుమతిగా అందజేస్తాం. వారి నిబద్ధత, విజయానికి ఇంతకంటే ఉత్తమమైన సమయం ఉండదు' అని ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కాగా ఈ ఎంజీ విండ్సర్ కారు ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని వచ్చే నెల 13న ఆవిష్కరించనున్నారు.