TG: నారాయణపేట జిల్లా మరికల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకద్ర మండలం నార్లోనికుంటకు చెందిన వడ్డే శివ (34) అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా, తీలేరు స్టేజి వద్ద కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శివ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించగా, కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.