స్కూల్ బస్సును ఢీ కొట్టిన కారు.. తప్పిన ప్రమాదం (వీడియో)

TG: ఖమ్మం జిల్లాలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. సత్తుపల్లి ప్రధాన రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు స్కూలు బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని తప్పించబోయిన కారు ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉండగా అందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్