TG: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ రోడ్లపై ఓ హోండా సిటీ కారు ఓవర్ స్పీడుతో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ‘తెలంగాణ టైగర్’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను ప్రదర్శిస్తూ, సాధారణ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ స్థానంలో ‘రేవంత్ రెడ్డి’ అనే పేరుతో ఈ కారు తిరుగుతోంది. కారు వెనుక భాగంలో అడ్వకేట్ గుర్తు కూడా కనిపించింది. ప్రస్తుతం ఈ కారు ఫొటోలు, వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి. నంబర్ ప్లేట్ లేకుండా ఈ వాహనం ఎలా రోడ్లపై తిరుగుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.