TG: యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో నీట మునిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్‌గా పోలీసులు గుర్తించారు. కారులో ఆరుగురు ఉండగా ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీశారు. HYD నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.