కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి.. వీడియో వైరల్

విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక భావోద్వేగ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో మ్యాచ్ అనంతరం హోటల్‌కు వెళ్తున్న సమయంలో ఒక చిన్నారి కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం ప్రయత్నించాడు. అయితే భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో, కోహ్లీ గమనించకుండానే వెళ్లిపోవడంతో ఆ బాలుడు నిరాశతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. చేతిలోని బ్యాట్‌ను కింద పడేసి వెక్కివెక్కి ఏడ్చిన వీడియో నెటిజన్లను కదిలిస్తోంది. ఈ ఘటనపై కొందరు చిన్నారి భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటుండగా, మరికొందరు భద్రతా కారణాలు కూడా ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్