బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారి.. గాల్లోనే క్యాచ్ పట్టేశాడు (వీడియో)

లండన్‌లో ఓ భారతీయ యువకుడు అసాధారణ సాహసం చేసి మూడేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడాడు. ఇల్‌ఫోర్డ్‌లోని ఓ భవనం కిటికీ అంచుపై వేలాడుతూ కిందపడే ప్రమాదంలో ఉన్న చిన్నారిని భారతీయ రెస్టారెంట్ మేనేజర్ మహ్మద్ జెసిల్, ఓ పోలీస్ అధికారి కలిసి గాల్లోనే పట్టుకుని రక్షించారు. దాదాపు తొమ్మిది నిమిషాల పాటు కిటికీ అంచును పట్టుకుని వేలాడిన చిన్నారిని ఈ ఇద్దరూ రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్