కృష్ణవంశీ డైరెక్షన్‌లో మహేష్ బాబు- సోనాలీ బింద్రే జంటగా నటించిన మురారి సినిమా శుక్రవారం రీ రిలీజ్ కావడంతో అభిమానులు సందడి చేస్తున్నారు. మ్యారేజ్‌పై ఆల్‌టైమ్ హిట్ సాంగ్ అలనాటి రామచంద్రుడు థియేటర్‌లో వస్తుండగా ఓ జంట నిజంగానే పెళ్లి చేసుకుంది. యువకుడు పసుపు తాడును యువతి మెడలో కట్టాడు. దీంతో ప్రేక్షకులు అక్షింతలు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.