TG: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం శివారులో దారుణం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న భార్యభర్తలపై దుండగులు దాడి చేశారు. భర్త అనిల్ పై కత్తితో దాడి చేసి.. ఆయన భార్య మీనాను గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. అనిల్‌కు తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.