కార్తిక దీపాన్ని తీసుకొచ్చి ఓ ఇంటిపై పడేసిన కాకి.. 4 తాటాకిళ్లు దగ్ధం (VIDEO)

AP: విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరులో శుక్రవారం ఉదయం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కార్తికమాసం పూజలో ఉంచిన దీపాన్ని ఒక కాకి ఎత్తుకెళ్లి ఒక తాటాకు ఇంటిపై పడేయడంతో మంటలు చెలరేగాయి. అవి కాస్త ఇతర ఇళ్లకు అంటుకోవడంతో నంబూరి గోపి, రెడ్డి సాంబ, కొక్కెర మాలచ్చమ్మ, మహంతి లక్ష్మిలకు చెందిన 4 తాటాకిళ్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గోపి ఇంట్లో ఉంచిన రూ.1 లక్ష నగదు, అర తులం బంగారం కూడా దగ్ధమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్