అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్ల పేరిట 'సైబర్' వల

బ్యాంకుల్లోని అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్ల కోసం ఆర్‌బీఐ తెచ్చిన 'ఉద్గమ్' (UDGAM) పోర్టల్‌ను సైబర్ కేటుగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. డబ్బులు ఇప్పిస్తామంటూ నకిలీ లింకులు పంపి ఖాతాలు ఖాళీ చేస్తున్నారని వీసీ సజ్జనార్ హెచ్చరించారు. అధికారిక లింక్ http://udgam.rbi.org.in మాత్రమే వాడాలని, ఆర్‌బీఐ/బ్యాంకుల పేరుతో వచ్చే సందేశాల్లోని లింకులను నమ్మవద్దని సూచించారు. ఆర్‌బీఐ ఎప్పుడూ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు అడగదని, మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్