అఖండ-2 ఫస్ట్ టికెట్ కోసం లక్ష రూపాయలు చెల్లించిన అభిమాని!

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'అఖండ-2'. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అఖండ' చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో, దీనికి సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి, ఒక అభిమాని మొదటి టికెట్ కోసం లక్ష రూపాయలు చెల్లించి వేలం పాటలో గెలుచుకున్నారు. జర్మనీలో జరిగిన ఈ వేలం పాటలో రాజశేఖర్ పార్నపల్లి అనే అభిమాని ఈ టికెట్‌ను సొంతం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్