ఐవరీకోస్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీ బస్సులు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది మృతి చెందగా మరో 28 మంది దాకా గాయపడ్డారు. బ్రొకోవా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.