యూపీలోని గోండాలో కర్నైల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హత్తి గ్రామంలో చికెన్ వండటంపై భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో 6 ఏళ్ల మహక్ అనే చిన్నారి మృతి చెందింది. గొడవ సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మరణించినట్లు ధృవీకరించారు. చిన్నారి శరీరంపై గాయాలు లేవని, పోస్ట్మార్టం నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నితీష్ సింగ్ తెలిపారు. చిన్నారి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.