విమానంలో ఎమ్మెల్యే, ప్రయాణికుడి మధ్య గొడవ!

దిల్లీ నుంచి లఖ్‌నవూ వెళ్తున్న ఎయిరిండియా విమానం AI-837లో మంగళవారం అమేథీ ఎమ్మెల్యే రాకేశ్‌ ప్రతాప్‌సింగ్‌కు, ప్రయాణికుడు సమద్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రయాణికుడు సమద్‌ అసభ్య పదజాలంతో దూషించడంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారు. విమానం గాల్లో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. విమానయాన సిబ్బంది జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఎమ్మెల్యేను దూషించిన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్