ఉత్తరప్రదేశ్ కాస్‌గంజ్ జిల్లా సోరాన్ పట్టణంలో కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన చిన్న గొడవ పెద్దదై రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. కారు రోడ్డుపై నిలిపారంటూ జరిగిన వాగ్వాదం ఇరువర్గాల మధ్య రాళ్లు రువ్వుకోవడం, కాల్పులు జరగడంతో ఉద్రిక్తత చెలరేగింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై అదనపు బలగాలను మోహరించారు. ఘర్షణలో గాయపడిన రియాజ్ అహ్మద్‌ను ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిని అరెస్టు చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.