ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో వివాహ వేడుకలో విషాదం నెలకొంది. జయమాల వేడుకకు ముందు డీజే డ్యాన్స్ చేస్తుండగా వివాదం తలెత్తింది. అమ్మాయి పైపు బంధువు ఒకరు డ్యాన్స్ చేస్తుండగా.. గొడవ మొదలైంది. గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. తాగిన మైకంలో ఉన్న నిందితులు వరుడిని తూపాకితో తలపై బలంగా కొట్టారు. దీంతో అతడు కిందపడిపోగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వరుడు మృతి చెందాడు. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.