బిహార్‌లోని గయ జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి మండపంలో రసగుల్లా కారణంగా గొడవ జరిగింది. ఫంక్షన్ హాల్‌లో వరుడు, వధువు తరఫు కుటుంబాల వారు బాహాబాహీకి దిగారు. దీంతో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది. వరుడి కుటుంబంపై వధువు తరఫు వారు వరకట్నం కేసు పెట్టారు. అసలు సమస్య రసగుల్లాతోనే వచ్చిందని, వరకట్నం మ్యాటరే లేదని వరుడి ఫ్యామిలీ ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.