సముద్రంలో వేటకు వెళ్లిన బోట్‌కు అగ్ని ప్రమాదం.. వీడియో

సముద్రంలో వేటకు వెళ్లిన బోటులో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతి అయింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో ఆదివారం జరిగింది. అయితే ప్రమాదాన్ని గుర్తించి బోటులోని మత్స్యకారులు మరో బోటులోకి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్ లోపమే ఈ ప్రమాదానికి కారణమని మత్స్యకారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్