రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు.. ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమం (VIDEO)

TG: హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లో ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వారిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕